: సహారా హోటళ్ల కొనుగోలుకు బ్రూనై సుల్తాన్ ఆసక్తి!


సెబీకి చెల్లించాల్సిన పదివేల కోట్ల కోసం లండన్, న్యూయార్క్ లోని హోటళ్లను అమ్మేందుకు సహారా అధినేత సుబ్రతారాయ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ రెండు చోట్ల సహారాకు ఉన్న ప్లాజా, డ్రీమ్ హోటల్స్, గ్రోస్వెనోర్ హౌస్ హోటళ్ల కొనుగోలుకు బ్రూనై సుల్తాన్ బిడ్ వేసినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' వెబ్ సైట్ ఎడిషన్ తెలిపింది. ఈ మేరకు బ్రూనై అనుబంధ పెట్టుబడి సంస్థ మూడు హోటళ్లకు రెండు బిలియన్ డాలర్లు చెల్లిస్తామన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో బ్రూనై అధికారులు సహారా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారట. వచ్చే నెలలో అమ్మకానికి సంబంధించి ఒప్పందం కూడా జరగవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో రిమాండులో ఉన్న సుబ్రతారాయ్ హోటళ్ల అమ్మకానికి సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News