: టీఎస్ సర్కార్ నిర్ణయంపై హైకోర్టులో కళాశాలల యాజమాన్యాల పిటిషన్.. కాసేపట్లో విచారణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 174 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేసింది. ఈ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... 174 కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. వెబ్ కౌన్సిలింగ్ లో తమ పేరు లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో కళాశాలల యాజమాన్యాలు సవాలు చేశాయి. హైకోర్టు కాసేపట్లో ఈ కేసు విచారణను చేపట్టనుంది.