: భారతదేశం హిందూదేశమే, భారతీయులందరూ హిందువులే: మోహన్ భగవత్
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం హిందూ రాజ్యమని... హిందుత్వమనేది దాని గుర్తింపని... హిందుత్వం దేశంలోని అన్ని మతాలను తనలో ఇముడ్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు. వీహెచ్ పీ సంస్థ ఏర్పాటయ్యి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోహన్ భగవత్ గత వారం కటక్ లో జరిగిన ఓ సభలో కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. ఇండియా అంటే హిందుస్థాన్ అని, హిందూస్థాన్ లో ఉండే పౌరులంతా హిందువులు గానే పిలువబడతారని ఆన్నారు. ప్రపంచం అంతా భారతీయులను హిందువులుగానే గుర్తిస్తోందని, అందువల్ల ఇండియా హిందూ దేశమేనని వ్యాఖ్యానించారు. భారతీయులందరి సాంస్కృతిక గుర్తింపు హిందుత్వమే అన్నారు. దేశ వాసులంతా ఈ మహోన్నత సంస్కృతికి వారసులని పేర్కొన్నారు. ఇంగ్లండ్ లో ఉన్నవాళ్లను ఇంగ్లీష్ వాళ్లని... అమెరికాలో ఉండేవారిని అమెరికన్స్ అని... జర్మనీలో ఉండేవారిని జర్మన్స్ అని పిలుస్తున్నప్పుడు... హిందుస్థాన్ లో ఉంటున్నవారిని హిందువులు అని పిలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.