: జగన్ సమావేశానికి 29 మంది వైకాపా ఎమ్మెల్యేలు డుమ్మా


వైకాపా అధినేత జగన్ నివాసంలో నిన్న ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి ఏకంగా 29 మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వీరిలో కొందరు... ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ వైకాపాకు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని సమాచారం. మరికొందరు మాత్రం పార్టీలో యాక్టివ్ గా ఉంటూనే... అధికారపక్షంతో సంబంధాలు నెరపుతున్నారు. అయితే, కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశానికి గైర్హాజరయ్యారని... వీరంతా వ్యక్తిగత పనులవల్లే హాజరుకాలేకపోయారని... ఓ వైకాపా నేత చెప్పారు.

  • Loading...

More Telugu News