: విభజన చట్టంలోని అన్ని అంశాలనూ దశల వారీగా అమలుచేస్తాం: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అన్ని అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించలేమని అన్నారు. దశల వారీగా చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్రాలు స్వలాభాల కోసం పనిచేయరాదని... దేశం, రాష్ట్రాలు కలసి ఒక టీం లాగా పని చేయాలని... అప్పుడే దేశం అభివృద్ధి పథంలో కొనసాగుతుందని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని... నేతలు సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. అనవసర రాద్ధాంతాలతో రాష్ట్ర ప్రగతి దెబ్బతింటుందని చెప్పారు.