: ‘ఒక లైలా కోసం’ ఆడియో వేడుకలో అపశ్రుతి
నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘ఒక లైలా కోసం’ ఆడియో వేడుకలో అపశ్రుతి చోటు చేసుకుంది. విజయవాడలో నిర్వహించిన ఈ ఆడియో ఫంక్షన్ లో అభిమానుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. నాగచైతన్యను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో ఎస్కలేటర్ వద్ద ఒక్కసారిగా తోపులాట జరిగి ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో నాగచైతన్య కార్యక్రమాన్ని ముగించుకుని హడావుడిగా వెళ్లిపోయారు.