: వారెవ్వా... గోవా అంటోన్న పర్యాటకులు


‘వారెవ్వా... గోవా’ అని పర్యాటకులు అంటున్నారు. సరదాగా కాసేపు గోవా సముద్ర తీరంలో గడిపేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు. బీచ్ లు, అందమైన జలపాతాలు, మరింత అందమైన ప్రకృతి సౌందర్యం, వన్యప్రాణులు... ఇలా చెప్పుకుంటూ పోతే గోవా ప్రత్యేకతలే వేరు. 125 కి.మీ. మేర విస్తరించిన గోవా బీచ్ లలో సాయంత్రమైతే చాలు, పర్యాటకులకు స్వర్గం కనిపిస్తుంది! భారత్ కు వస్తున్న పర్యాటకుల్లో 7 శాతం మంది గోవాకు క్యూ కడుతున్నారు. గతేడాది 32 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తే... ఈ ఏడాది 40 లక్షల మంది పర్యాటకులు గోవాకు వచ్చారు. రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో గోవాకు వెళ్లేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. దేశంలోని ఐదవ స్థానంలో ఉన్న ఎత్తైన జలపాతం దూద్ సాగర్ గోవాలోనే ఉంది. 450 ఏళ్ల పాటు పోర్చుగల్ పాలనలో ఉన్న గోవా బాగా అభివృద్ధి చెందింది.

  • Loading...

More Telugu News