: ఫేస్ బుక్ లో పెట్టిన హనీమూన్ ఫోటోలను తొలగించండి: కోర్టు
అత్యుత్సాహంతో తమ హనీమూన్ ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టిన ఓ మహిళకు కోర్టు మొట్టికాయలు వేసింది. తన అనుమతి లేకుండా భార్య ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫోటోలను తొలగించాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపిన కోర్టు ఆ ఫోటోలను వెంటనే తొలగించాలంటూ ఆమెకు సూచించింది. ఆ ఫోటోలను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం ఆర్టికల్ 10 సెక్షన్ తో పాటు భర్త యొక్క ప్రాథమిక హక్కులను ఆమె ఉల్లంఘించారని పేర్కొంది. దీనిపై వాదించిన భార్య తరపు న్యాయవాది... ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం పరిపాటిగా మారిందని, ప్రైవేటు ఆల్బమ్ లను పోస్ట్ చేయడానికి ఫేస్ బుక్ ఒక వారధిలాంటిదని వాదించాడు. అయితే, ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఆ ఫోటోలను వెంటనే తీసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును భర్త తరపు న్యాయవాది స్వాగతించాడు. ఈ రకంగా ఆమె భర్తకు కల్పించిన నష్టానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపాడు. ఫేస్ బుక్ లో ఇష్టానుసారం పోస్ట్ చేసేవారికి ఇదొక హెచ్చరిక లాంటిదని లాయర్ అభిప్రాయపడ్డాడు.