: శ్రీకాకుళంలో సందడి చేసిన ‘చిన్ని కృష్ణులు’
శ్రీకాకుళం పట్టణంలోని పలు ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఇవాళ (ఆదివారం) ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో చిన్నారులకు రాధాకృష్ణుల వేషధారణ పోటీలు, ఉట్టి ఉత్సవాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాత శ్రీకాకుళంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం జరిగిన రాధాకృష్ణుల వేషధారణ పోటీలు సందడిగా సాగాయి. సుమారు 30 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి ఊయల సేవ నిర్వహించారు. విజేతలైన చిన్నారులకు బహుమతులను అందించారు.