: తీరు మార్చుకోని భారత్... స్కోరు 9/2
ఇంగ్లండ్ గడ్డమీడ భారత బ్యాట్స్ మెన్లు తేలిపోతున్నారు. గత ఇన్నింగ్స్ వైఫల్యాల నుంచి కొంతైనా నేర్చుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. క్రీజులో కాసేపు కూడా నిలవడానికి ఆసక్తి లేనట్టే... అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరుతున్నారు. ఓవల్ లో జరుగుతున్న చివరి టెస్ట్ మూడో రోజున ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 486 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 329 పరుగుల ఆధిక్యం లభించింది. రూట్ 149 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇషాంత్ 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ఘోరమైన ప్రారంభాన్ని ఇచ్చారు. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్ లో మురళీ విజయ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. వెంటనే మరో ఓపెనర్ గంభీర్ కూడా ఔట్ అయ్యాడు. 3 పరుగులు చేసిన గంభీర్ రనౌట్ అయ్యాడు. పుజారా క్రీజులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్లకు 9 పరుగులు (6.1 ఓవర్లు).