: అక్కడ లిక్కర్ లో ‘వయాగ్రా’ కలిపి అమ్మేస్తున్నారు!


లిక్కర్ లో ‘వయాగ్రా’ ఏమిటా అని అనుకుంటున్నారా? మద్యం అమ్మకాలను పెంచుకునేందుకు ఓ చైనా వ్యాపార వేత్త సరికొత్త బాట పట్టాడు. వయాగ్రా తరహాలో పనిచేసే ఒక రసాయన పదార్థాన్ని మద్యంలో కలుపుతూ వ్యాపారం చేస్తున్నాడు. చైనాకు చెందిన హంగ్ అనే వ్యాపారవేత్తకు ఒక మద్యం ఫ్యాక్టరీ ఉంది. ఆ క్రమంలో తన వ్యాపారాన్ని పెంచాలనుకున్న హంగ్... వయాగ్రా తరహాలో పనిచేసే ఒక రసాయన పదార్థాన్ని లిక్కర్ లో కలపాలని నిశ్చయించాడు. ఇంగ్లీషు మందుల్లో కలిపే సిల్డినఫీ అనే రసాయనాన్ని మద్యంలో మిక్స్ చేసేస్తున్నాడు. చైనా రాజధాని బీజింగ్ తో పాటు పలు ప్రాంతాల్లో ఈ మద్యం విక్రయాన్ని మొదలుపెట్టాడు. గత ఫిబ్రవరిలో లిక్కర్ ఫ్యాక్టరీని ప్రారంభించిన హంగ్ కు లాభాలు రావడంతో మరింత విస్తరించాడు. 100 మిల్లీ లీటర్ల మద్యంలో 130 మిల్లీ గ్రాముల ప్రభావిత పదార్థాన్ని కలుపుతున్నాడు. అది కాస్తా 750 లీటర్ల లిక్కర్ ద్రావకంగా మారుతుంది. ఈ క్రమంలోనే అతను వెయ్యి బాటిళ్లను విక్రయించాడు. వాంగ్ తన స్నేహితులపై ప్రేమ కురిపిస్తూ.. వారికి 810 బాటిళ్లను కానుకగా ఇచ్చాడు. ఈ తరహా మద్యం తాగిన వారిపై అది దుష్ప్రభావం చూపడంతో పోలీసులు వాంగ్ వ్యాపారాన్ని అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News