: సర్వేలో 25 శాతం మంది ఆంధ్రా అధికారులను ఎలా ఉపయోగిస్తారు?: రేవంత్ రెడ్డి
12 గంటల్లో 4 కోట్ల ప్రజల సమాచారాన్ని ఎలా సేకరిస్తారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్వేలో ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. సర్వేలో 25 శాతం మంది ఆంధ్రా అధికారులను ఉపయోగిస్తున్నారని... ఇది ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనేందుకు ఇతర సంస్థల ఉద్యోగులు కూడా రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పిందే జరగాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అన్నారు.