: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
విశాఖలోని కంచరపాలెం సమీపంలో ప్యాసింజర్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.