: తాగునీటి కోసం ఆర్డీఎస్ అధికారుల నిర్బంధం
గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించాలని డిమాండ్ చేస్తూ రాజోలి బండ్ డైవర్షన్ స్కీం అధికారులు, బూడిదపాడు మండల జడ్పీటీసీ భర్తను, వైస్ ఎంపీపీలను మహబూబ్ నగర్ జిల్లా ఉండవల్లి వాసులు నిర్బంధించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్న ఉండవల్లి వాసులు, జూరాల నీటితో తమ దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే వారి డిమాండ్ ను తేలిగ్గా తీసుకున్న ఆర్డీఎస్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. వారికి బూడిదపాడు మండల జడ్పీటీసీ భర్త, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వంత పాడారు. దీంతో భగ్గుమన్న ఉండవల్లి వాసులు, ఆర్డీఎస్ డీఈఈ, ఏఈఈ, వర్క్ ఇన్ స్పెక్టరులతో పాటు 8 మంది లష్కర్లు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ భర్తలను నిర్బంధించారు. తాగునీటి కోసం జూరాల నీటిని విడుదల చేస్తామంటేనే అధికారులను విడుదల చేస్తామని భీష్మించారు.