: సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే


సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. సౌందర్య ఉత్పత్తుల్లో పాదరసం స్థాయి 1 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం) మించకూడదని అమెరికా ప్రమాణాల్లో నిర్దేశించారు. అయితే కొన్ని ఉత్పత్తుల్లో 2.10 లక్షల పీపీఎం మేర ఈ రసాయనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హానికారక పాదరసం కలిసిగిన సౌందర్య లేపనాలను ముఖానికి పులుముకోవడం, చర్మం కిందకు చొప్పించుకోవడం వంటివి చేస్తున్నారని ఆమెరికా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. చర్మం నిగారింపు సంతరించుకుంటుందనే భావంతో పలువురు ఇలా చేస్తున్నారని తెలిపిన పరిశోధకులు, ఆయా ఉత్పత్తులు వాడితే అవి చేతి మీద ఉండిపోయి, తద్వారా ఆహారంలోకి, చిన్నారులు నిద్రించే షీట్ల పైకి పాదరసం చేరుతుందని వారు హెచ్చరించారు. ఈ లోహం కలిగిన ఉత్పత్తుల వాడకం వల్ల నల్లమచ్చలు పోవడం, కొత్త నిగారింపు సంతరించుకోవడం సంగతేమో కానీ, మెదడు పనితీరు, మూత్రపిండాల పనితీరు మందగిస్తుందని, తలనొప్పి, అలసట, చేతులు వణకడం, కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తుతాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News