: కృష్ణా జిల్లాలో కంపించిన భూమి... పరుగులు తీసిన ప్రజలు


కృష్ణా జిల్లాలో భూమి కంపించడంతో... ఏం జరుగుతోందో తెలియని ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పరుగులు తీశారు. నందిగామ, రైతుపేట ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కళ్ల ముందే భూమి తిరిగినట్టు అనిపించడం, ఇళ్లల్లోంచి సామాన్లు కిందపడిపోవడంతో బయటకు పరుగులుతీశారు. కాగా, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం.

  • Loading...

More Telugu News