: ఎగుమతుల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ: మోడీ


ఎగుమతులకు సంబంధంచి ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లభించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తమ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కేంద్రంపై ఆధారపడటం మాని, తామే కొత్త ప్రణాళికలు రూపొందించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేందుకు వెసులుబాటు కలగనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ’మీ ఉత్పత్తులను మీరే నేరుగా ఎగుమతి చేసుకోండి. కేంద్రం సహాయం చేస్తుంది కాని, మీరే ప్రణాళికలు రూపొందించుకుని, మీ పక్క రాష్ట్రాలతో పోటీ పడండి. ఎగుమతులను పెంచుకోండి. ఆదాయాన్నీ పెంచుకోండి‘ అంటూ శనివారం జరిగిన ఓ సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. తద్వారా దేశ ఎగుమతుల గణనీయ ఎదుగుదలకు మోడీ నాంది పలికారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన సెజ్ లను పూర్తి చేసే విషయంపైనా మోడీ దృష్టి సారించారు. ఆయా సెజ్ లు ఏఏ కారణాల చేత నిలిచిపోయాయన్న అంశాన్ని నిర్ధారించేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. భారీ లక్ష్యాలతో మొదలై వివిధ అవాంతరాల వల్ల పూర్తి కాకుండా నిలిచిపోయిన ప్రాజెక్టుల వలన దేశీయ ఉత్పత్తి స్తంభించిపోయిందన్న భావనలో ఉన్న మోడీ, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తన కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారట.

  • Loading...

More Telugu News