: మానవత్వానికి మచ్చతెచ్చిన స్వచ్ఛంద సంస్థ


రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయి. ఏ వ్యక్తిని కదిపినా సమాజానికి మనం కూడా ఏదో చేయాలన్న తపన. అలాంటి తపనను చాలా స్వచ్ఛంద సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఫోన్లు చేస్తూ డబ్బులు దండుకునేందుకు ఇచ్చే ప్రాధాన్యం, ఆయా సంస్థల్లో నిర్లక్ష్యానికి గురయ్యేవారి పట్ల చూపడం లేదు. తాజాగా సికింద్రాబాద్ లోని హోం ఫర్ డిజేబిలిటీస్ వసతిగృహ నిర్వాహకురాలు మానవత్వానికి మచ్చతెచ్చే పని చేశారు. ఒక వికలాంగురాలిని తీసుకెళ్లి శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయారు. దిక్కులేకుండా ఆమె అలాగే ఉన్నారు. సేవ చేస్తామని చెప్పుకునే స్వచ్ఛంద సంస్థలు ఓ సారి తమని తాము అవలోకించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. దీనిపై ఎవరూ స్పందించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News