: తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో జేఏసీ పురుడుపోసుకుంది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ పేరిట ఆవిర్భవించిన ఈ వేదిక, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వెంటనే నిలిపివేయాలని కోరింది. అయితే, నాలుగో తరగతి ఉద్యోగుల క్రమబద్ధీకరణను తాము వ్యతిరేకించడం లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.