: రాయలసీమలో 2500 మెగావాట్ల సోలార్ విద్యుత్
రాయలసీమ జిల్లాల్లో 2500 మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. సౌర, పవన విద్యుత్ కేంద్రాల ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులతో ఈ రోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సౌర, పవన విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారికి సింగిల్ విండో పద్దతిలో వారంలోపే అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఎన్టీపీసీ ద్వారా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.