: 'పద్మభూషణ్' పురస్కారానికి సైనా పేరు సిఫారసు
హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పేరును ప్రతిష్ఠాత్మక 'పద్మభూషణ్' పురస్కారానికి భారత బ్యాండ్మింటన్ సంఘం (బాయ్) సిఫారసు చేసింది. ఈ మేరకు 'బాయ్' అధికారి ఒకరు మాట్లాడుతూ, సైనా పేరును పద్మభూషణ్ అవార్డుకు రికమెండ్ చేసినట్లు చెప్పారు. 2010లో ఆమె పద్మశ్రీ అందుకున్నారన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత సైనా పేరును ఈ అవార్డుకు సిఫార్సు చేయాలనుకున్నామని... కానీ, రెండు అవార్డులకు కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల విరామం ఉండాలనే రికమెండ్ చేయలేదని చెప్పారు.