: 'పీకే' పోస్టర్లపై జోకులు పేల్చిన షారూఖ్ ఖాన్


ఆసక్తిరేకెత్తిస్తున్న 'పీకే' సినిమా పోస్టర్లపై బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనదైన శైలిలో హాస్యం పండించారు. కొత్త చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' ఆడియో లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ, త్వరలోనే తాము కూడా న్యూడ్ పోస్టర్లను రూపొందిస్తామని సరదాగా వ్యాఖ్యానించారు. 'పీకే' పోస్టర్లలో అమీర్ ఖాన్ ఒక్కడే దిగంబరంగా ఉన్నాడని, తామైతే చిత్రంలోని నటీనటులందరితో నగ్న పోస్టర్లు రూపొందిస్తామని నవ్వుతూ చెప్పారు. "పోలికల జోలికి వెళ్ళడంలేదు. వారి పోస్టర్లు వారివే, మా పోస్టర్లు మావే. వారి సినిమా వారిదే, మా సినిమా మాదే. ఎక్కడా పోలికలేదు" అంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News