: లాటరీ పద్ధతిలో సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సివిల్స్ అధికారుల కేటాయింపుపై జరిగిన ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ ఢిల్లీలో ముగిసింది. హోంమంత్రి కార్యాలయం నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో లాటరీ ప్రక్రియ ద్వారా అధికారులను కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. ముందుగా తెలంగాణ పేరు లాటరీలో రావడంతో రోస్టర్ విధానాన్ని ఆ రాష్ట్రం నుంచే ప్రారంభించారు. ఈ క్రమంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లకు చెందిన సీనియర్ అధికారులను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు ఐఏఎస్-163, ఐపీఎస్-112, ఐఎఫ్ఎస్-65 మంది అధికారులను కేటాయించారు. ఆంధ్రాకు ఐఏఎస్-211, ఐపీఎస్-144, ఐఎఫ్ఎస్-85 మంది అధికారులను కేటాయించారు. వచ్చే శనివారం కల్లా రెండు రాష్ట్రాలకు అధికారుల కేటాయింపు పూర్తవుతుందని కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు. అధికారుల విభజన 13:10 నిష్పత్తిలో జరుగుతుందని వివరించారు. గతంలో ఆప్షన్ల కోసం ఇచ్చిన సీల్డు కవర్లను నేడు కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. కమిటి మరోసారి సమావేశం కానుందని పీటర్ తెలిపారు.