: తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల


దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో మూడు ఎంపీ, 33 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 20న వాటన్నింటికీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ఉంటుంది. సెప్టెంబర్ 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మెదక్ ఎంపీ స్థానం, ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణాజిల్లా నందిగామ మండలం అసెంబ్లీ స్థానం కూడా ఉన్నాయి. కాగా, కోర్టు కేసు నేపథ్యంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేయలేదు.

  • Loading...

More Telugu News