: మన దేశ రక్షణ సామర్థ్యాన్ని ఇకపై ఏ దేశం సవాల్ చేయలేదు: మోడీ
'ఐఎన్ఎస్ కోల్ కతా' చేరికతో భారత నావికాదళం పూర్తిగా బలోపేతం అయిందని ప్రధాని మోడీ తెలిపారు. ముంబై తీరంలో ఐఎన్ఎస్ కోల్ కతాను జాతికి అంకితం చేసిన అనంతరం నావికా సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత స్వదేశీ సాంకేతిక నిర్మాణ సామర్థ్యానికి ఐఎన్ఎస్ కోల్ కతా నిదర్శనమని చెప్పారు. ఈ యుద్ధ నౌక ద్వారా సమాచార సేకరణ మరింత తేలిక అవుతుందని అన్నారు. ఐఎన్ఎస్ కోల్ కతా చేరికతో మన రక్షణ సామర్థ్యాన్ని మరే ఇతర దేశమూ సవాల్ చేయలేదని ప్రధాని తెలిపారు. డిఫెన్స్ టెక్నాలజీని పెంచేందుకు మరిన్ని నిధులను పెంచుతామని చెప్పారు.