: ఉత్తరాఖండ్ లో మళ్లీ భారీ వర్షాలు... పుణ్యప్రదేశాల్లో చిక్కుకున్న యాత్రికులు
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పౌరి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో, ఇళ్లు కూలి 17మంది మృతి చెందారు. వరదల కారణంగా బద్రీనాథ్, గంగోత్రి లాంటి పలు పుణ్య ప్రదేశాల్లో యాత్రికులు చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను, యాత్రికులను రక్షించడానికి ప్రభుత్వం హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు నిలిచిపోయాయి.