: భారతదేశం కోసం దేవుడు పంపిన దేవదూత మోడీ
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. భారతదేశ సమస్యల పరిష్కారానికి దేవుడు పంపిన దేవదూతే... నరేంద్రమోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. హిందుత్వమనేది ఓ మతం కాదని, అది ఓ జీవన విధానమని పేర్కొన్నారు. దేశంలో కొంతమంది నాయకులు కుల, మత, ప్రాంత, భాషా విభేదాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసి ముందుకు వెళ్లాలని, విభేదాలు పక్కన పెట్టి... అభివృద్ధిలో పోటీపడాలని ఆయన సూచించారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్ని ఎక్కువ కాలం సంతోష పెట్టలేమని... ఆరు నెలల తర్వాత తమకేం చేశారని వాళ్లు ప్రశ్నిస్తారని వెంకయ్య నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కారణంగా... తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రులు అభివృద్ధికి అగ్రతాంబూలం ఇవ్వాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.