: ఆగస్ట్ 31న జపాన్ కు వెళ్లనున్న మోడీ


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగురోజుల పర్యటన నిమిత్తం ఈనెల 31 న జపాన్ కు వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు ఆయన జపాన్ లో పర్యటించనున్నట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. వాణిజ్యం, పౌర అణుసహకారం, భద్రత లాంటి అంశాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి మోడీ ఈ పర్యటన చేస్తున్నారు. వాస్తవంగా జులై నెలలోనే మోడీ జపాన్ పర్యటన ఖరారైంది. అయితే, ఆ తర్వాత అదే సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో... అప్పట్లో పర్యటన వాయిదా పడింది.

  • Loading...

More Telugu News