: సినీ పరిశ్రమపై దాసరి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినీ దర్శకరత్న దాసరి నారాయణరావు టాలీవుడ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాలు ఆడనివ్వడం లేదని ఎప్పుడూ గళమెత్తే దాసరి, ఈసారి నటీనటులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో 'మూవీమొఘల్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ కొందరు నటీనటుల చేతుల్లో చిక్కుకుపోయిందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉందని ఆయన వాపోయారు.