: మన రాష్ట్రీయ క్రీడ చూసేందుకు రేపు విశాఖ వస్తున్న అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ మన రాష్ట్రీయ క్రీడ కబడ్డీ చూసేందుకు రేపు విశాఖపట్టణం రానున్నాడు. రేపటి నుంచి నాలుగు రోజులపాటు ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ లు విశాఖపట్టణంలో జరుగనున్నాయి. జైపూర్ కబడ్డీ జట్టును కొనుగోలు చేసిన అభిషేక్ బచ్చన్ తన జట్టుకు మద్దతు తెలపనున్నారు. కాగా, రేపు విశాఖలో జరుగనున్న మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ జట్టు, తెలుగు టైటాన్స్ తో తలపడనుంది.