: స్కూల్ లో నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపిన మావోయిస్టులు
దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవాలు సంబరంగా జరుపుకుంటున్న వేళ ఖమ్మం జిల్లాలోని చర్ల మండలం మామిడిగూడెం, దేవరపల్లి ప్రభుత్వ పాఠశాలలో మావోయిస్టులు నల్లజెండాలను ఎగురవేశారు. పోలవరం ముంపుమండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిరసన దినంగా పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో వారు స్కూలు వద్ద నల్ల జెండాలను కట్టి, నల్లబ్యానర్లను ఏర్పాటు చేశారు. కాగా, కొన్ని చోట్ల మావోయిస్టులు ఏర్పాటు చేసి బ్యానర్లు, పోస్టర్లను పోలీసులు తొలగించారు.