: కోటి మంది తెలంగాణవారు కాదా?: రావెల కిషోర్ బాబు
రాజధాని అనే ఆలోచనతో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్ధిరపడిన కోటి మందిని స్థానికులు కాదనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని స్థానికేతరులు అనడం అవివేకమని అన్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటే పప్పులు ఉడకవని, ఇబ్బందులు తలెత్తితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కిషోర్ బాబు హెచ్చరించారు. 1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా తెలంగాణకు చెందినవారమేనంటూ 19న జరిగే కుటుంబ సర్వేలో చెప్పాలని ఆయన సూచించారు. సర్వే ఫార్మాట్‌లో ‘ఏ రాష్ట్రం నుంచి వచ్చారనే’ కాలమ్‌లో అలా చెప్పకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.