: సింగపూర్ కి చరిత్ర లేదు...ఏపీకి చరిత్ర ఉంది: పూర్ణానందస్వామి
ప్రపంచ చరిత్రలో సింగపూర్‌కు ఎటువంటి స్థానం లేదని, ఆంధ్రప్రదేశ్ కు అఖండమైన చరిత్ర ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని చరిత్రాత్మక కళాఖండంగా తీర్చిదిద్దాలని సూచించారు. 13 జిల్లాల చారిత్రక నేపథ్యం ప్రతిబింబించేలా రాజధాని నగర నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. అభివృద్ధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులనే గాక ఆరు కోట్ల మంది ప్రజలను కూడా భాగస్వాములుగా చేయాలని ఆయన కోరారు. విభజన కారణంగా అవమానాల పాలైన మనం కలసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించిన పరిపూర్ణానంద స్వామి, అన్ని పార్టీలు ప్రభుత్వంతో కలసి రావాలని కోరారు.