: బాబు, కేసీఆర్ మళ్లీ కలిశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కలిశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం పలికిన సందర్భంలో కలిసిన వీరిద్దరూ అనంతరం మరో వేదికపై కనబడలేదు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తేనీటి విందు ఇవ్వడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి కలుసుకున్నారు. ఇదిలావుంటే, తమ, తమ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అండగా వారి మంత్రి వర్గ సహచరులు కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. తేనీటి విందులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వారి మంత్రి వర్గ సహచరులు కూడా ఈ విందులో పాలుపంచుకోవడం విశేషం. అయితే, అక్కడ మాత్రం అందరూ నవ్వులు చిందిస్తూ కనిపించారు.