: 'బిగ్ బాస్ 8'కి కూడా సల్మానే
కలర్స్ టీవీలో ప్రసారమయ్యే 'బిగ్ బాస్' రియాలిటీషో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్ల వ్యవహారశైలితో 'బిగ్ బాస్' సీజన్ 7 సందర్భంగా ఇకపై హోస్టుగా తాను చేయలేనని పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన సల్మాన్ ఖాన్... సీజన్ 8 కి కూడా హోస్టింగ్ చేసేందుకు ఎట్టకేలకు అంగీకరించాడు. గతంలోనే అత్యధిక పారితోషికంతో సల్లూభాయ్ నోరు కట్టేసిన 'బిగ్ బాస్' ఈసారి ఏ మంత్రమేశాడో? ఎంత ముట్టజెప్పాడో? కానీ సీజన్ 8కి కూడా ప్రెజెంటర్ సల్లూభాయేనని సమాచారం. ఈసారి పైలట్ వేషధారణలో సల్మాన్ కనువిందు చేయనున్నాడు. ఫస్ట్ లుక్ చిత్రాలు బయటకి రావడంతో సల్మాన్ అభిమానులు షో ఎప్పుడు ఎదురవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.