: రెండు తెలంగాణకి... రెండు ఆంధ్రాకి: కోడెల
అసెంబ్లీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో రెండు ఫ్లోర్లు తెలంగాణ, మరో రెండు ఫ్లోర్లు ఏపీ వినియోగించుకునేలా తెలంగాణ స్పీకర్ తో ఒప్పందం కుదిరిందని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. అసెంబ్లీలో పార్టీలకు కార్యాలయాల కేటాయింపుపై రెండు రాష్ట్రాల స్పీకర్ల మధ్య భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కొత్త అసెంబ్లీలోని మంత్రుల చాంబర్లను ఇరు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకుంటాయని అన్నారు. పాత అసెంబ్లీ భవనంలోని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ చాంబర్ మినహా మిగతావన్నీ ఖాళీ చేసేందుకు తెలంగాణ స్పీకర్ అంగీకరించారని ఆయన వెల్లడించారు. గవర్నర్, తెలంగాణ స్పీకర్ ఇచ్చిన సూచనల పట్ల తాము సానుకూలంగా స్పందించామని ఆయన తెలిపారు. అలాగే ఆర్సీ బిల్డింగ్ ను పూర్తిగా తెలంగాణకే కేటాయించినట్లు కోడెల వివరించారు.