: పంజాబ్ సీఎంపై బూటు విసిరిన యువకుడు


పంజాబ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పైకి ఓ నిరుద్యోగ యువకుడు బూటు విసిరాడు. బూటు దూరంగా పడడంతో దాడి నుంచి బాదల్ తప్పించుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడు పంజాబ్ ముఖ్యమంత్రిపై దాడి చేయడానికి కారణమేంటి? నిరుద్యోగ సమస్యేనా? లేక, ఇంకేదయినా సమస్య ఉందా? అనే వివరాలు వెల్లడి కావాల్సిఉంది.

  • Loading...

More Telugu News