: చివరి టెస్టు ఆరంభానికి వరుణుడి ఆటంకం
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు ఆలస్యంగా ఆరంభం కానుంది. మ్యాచ్ కు వేదికైన ఓవల్ మైదానం వర్షం కారణంగా చిత్తడిగా మారింది. దీంతో, మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు కాస్త ఆలస్యంగా మ్యాచ్ ఆరంభించాలని నిర్ణయించారు. టాస్ వేయాల్సి ఉంది. భారత్, ఇంగ్లండ్ తమ తుదిజట్లను ఇంకా ప్రకటించలేదు. కాగా, ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.