: ఈసారి జగన్ కు చెక్ పెట్టే బాధ్యత కేశవ్ కు అప్పగింత!


ఆంధ్రప్రదేశ్ రెండో దఫా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమవుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాలపై కీలక నేతలతో చంద్రబాబు గురువారం మంతనాలు జరిపారు. తొలి దఫా అసెంబ్లీ సమావేశాల్లో చాలా బాగా మాట్లాడాడని పేరు తెచ్చుకున్న జగన్ ను ఈసారి పూర్తిగా కట్టడి చేయాలని చంద్రబాబు ఈ మీటింగ్ లో నిశ్చయించారు. ప్రత్యేకించి జగన్ ను ఎలా టార్గెట్ చేయాలో... టీడీపీ సభ్యులకు సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ చేత తర్ఫీదు ఇప్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో... పయ్యావులకు అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ లేదు. అయితే తెర వెనుక ఉండి మొత్తం వ్యవహారం నడిపించాలని చంద్రబాబు కేశవ్ ను ఆదేశించారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పయ్యావుల కేశవ్ జగన్ అవినీతి విషయాలను బాగా మాట్లాడారని, అందుకే ఈ పనిని చంద్రబాబు ఆయనకు అప్పజెప్పారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ తమ మీద విరుచుకుపడితే... ఆయన అవినీతి బండారాలు, చిట్టాలు విప్పి ఎదురుదాడికి దిగేలా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

  • Loading...

More Telugu News