: తమిళ విలన్ భార్య మిస్సింగ్


తమిళంలో పలు చిత్రాల్లో విలన్, సహాయక పాత్రలు పోషించిన నటుడు కరాటే రాజా తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజా డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కాగా, 2008లో వివాహం చేసుకున్న ఈ నటుడికి ముగ్గురు సంతానం. సారం గ్రామం వద్ద నివసించే రాజా షూటింగ్ లతో బిజీగా ఉంటూ ఎప్పుడోగానీ ఇంటికివచ్చేవాడు కాదు. దీంతో, భార్యభర్తల మధ్య స్పర్ధలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రాజా భార్య దివ్య బుధవారం తన ముగ్గురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. అక్కడవారిని దిగబెట్టి మార్కెట్ కు వెళ్ళివస్తానని పయనమైంది. బయటికి వెళ్ళిన ఆమె తిరిగి ఇంటికి చేరలేదు. భార్య కనిపించడం లేదని అత్తామామల నుంచి సమాచారం అందుకున్న రాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News