: ల్యాంకో ఉడిపి ప్లాంట్ ను అదానీ గ్రూప్ కు విక్రయించిన లగడపాటి కుటుంబం
లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ల్యాంకో సంస్థ గత కొంతకాలంగా భారీ నష్టాల్లో నడుస్తోంది. తమకు ఈ ఏడాది మార్చి నాటికి రూ.36,000 కోట్ల నికర అప్పులు ఉన్నట్టు ల్యాంకో సంస్థ తన వెబ్ సైట్ లో పేర్కొంది. దీంతో భారీ రుణభారం నుంచి బయటపడే క్రమంలో... ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పట్టణంలో తన అధీనంలో ఉన్న 1200 మెగావాట్ల థర‌్మల్ పవర్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదాని గ్రూప్ ఆరు వేల కోట్ల రూపాయల భారీ మొత్తానికి ఈ ఫ్లాంట్ ను చేజిక్కించుకుంది. ఈ మొత్తంలో, రెండు వేల కోట్ల నగదును లాంకో ఇన్ ఫ్రాటెక్ తీసుకుంటుంది. మిగిలిన నాలుగువేల కోట్లను ల్యాంకో సంస్థ దీర్ఘకాలిక అప్పుల కింద... బ్యాంకులకు చెల్లించేందుకు అదానీ గ్రూప్ ఒప్పుకుంది. ఇక, మిగిలిన అప్పులను రీ షెడ్యూల్ చేయించుకోవడం కోసం ల్యాంకో సంస్థ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది.