: జైరాం రమేశ్ అదే మాట... చంద్రబాబుదీ అదే పాట!
ప్రజలు సెల్ ఫోన్ కు ఇచ్చినంత ప్రాధాన్యత మరుగుదొడ్ల ఏర్పాటుకు ఇవ్వరని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఇంతకుముందు వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు సైతం అలాంటి వ్యాఖ్యనే చేశారు. కర్నూలులో జరుగుతున్న 68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెల్ ఫోన్ ఉంటుంది గానీ మరుగుదొడ్డి ఉండదని అన్నారు. ప్రజలు సమాజహితాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు.