: డిజిటల్ రాష్ట్రాన్ని చూడాలని ఉందంటున్న చంద్రన్న


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్ ను మరోసారి చాటారు. ప్రపంచంలోనే మొదటి డిజిటల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలని బాబు ఆకాంక్షించారు. భవిష్యత్తులో ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ కేబుల్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. 3 సిటీలను మెగా సిటీలుగా, 13 సిటీలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. అంతేగాకుండా, ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్ళలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ధరల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ దిశగా పట్టణాల్లోనూ రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవినీతికి తావులేని రీతిలో, దళారీ వ్యవస్థకు అవకాశం లేని విధంగా లబ్దిదారులకే నేరుగా ఫలాలు అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News