: దేశంలో అందరికీ సెల్ ఫోన్ లు ఉన్నాయి... బ్యాంకు ఖాతాలు మాత్రం లేవు: మోడీ
దేశంలో ప్రతీ ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది కానీ... మెజార్టీ ప్రజలకు ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు లేవని ఎర్రకోట ప్రసంగంలో మోడీ వ్యాఖ్యానించారు. త్వరలో ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమం చేపట్టి... ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాతో పాటు లక్షరూపాయల బీమాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పేద కుటుంబాన్ని దేశ ఆర్థికవ్యవస్థతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. దేశయువత ఉద్యోగాలు చేయడం కాకుండా, ఉపాధి సృష్టి దిశగా ఆలోచించాలన్నారు. అలాగే, క్రీడాకారులు భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.