: హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం... సహకరించండి: చంద్రబాబు
పరిస్థితులు అనుకూలించకున్నా గానీ, హామీల అమలుకు తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తమకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు. రైతుల రుణాన్ని తీర్చుకుంటున్నామని బాబు తెలిపారు. వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొదటిసారిగా వ్యవసాయానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు. రుణమాఫీ ద్వారా 96.27 శాతం రైతులకు లబ్ది చేకూరుతుందని, మిగిలిన 3.73 శాతం మంది రైతులు లక్షన్నర మేర లబ్దిపొందుతారని బాబు వివరించారు. కర్నూలు ఏపీఎస్పీ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలిపారు.