: విభజన జీర్ణించుకోలేకపోయాను: బాబు


కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం కష్టాల్లో ఉన్నామని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు న్యాయం పొందాలనే తాము భావించామని, కానీ, కాంగ్రెస్ ఏకపక్ష విభజనతో ఇప్పుడు అందరి ముందు దోషిగా నిలుచుందని వివరించారు. విభజన అనంతరం అనేక దుష్ఫలితాలు చవిచూశామని, రాష్ట్రం ముందుకుపోవాలంటే అందరూ కార్యదీక్షతో పనిచేయాల్సిన అవసరం ఉందని బాబు ఉపదేశించారు. స్వాత్రంత్య దినోత్సవమే అందుకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందని బాబు చెప్పారు. సమైక్య ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యత ఉంటుందని బాబు ఉద్ఘాటించారు. తమ పాలనలో రైతులకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News