: గోల్కొండ నుంచి కేసీఆర్ ప్రసంగం... హైలైట్స్-2
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టీఎస్ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జెండాను ఆవిష్కరించి, ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే... * భారత జాతీయ ఉద్యమ చరిత్రను స్మరించుకోవాల్సిన సమయం ఇది. * బ్రిటన్ పార్లమెంటులో గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు. బ్రిటీష్ గడ్డపై గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం. * శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కళా నైపుణ్యానికి గోల్కొండ కోట ప్రతీక. * వజ్ర, వైఢూర్యాలకు కేంద్రం గోల్కొండ కోట. * ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల కోసం కమిటీ వేశాం. * గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను పంచాయతీలుగా మారుస్తాం. * పోలీసు శాఖలో 3,600 ఉద్యోగాల భర్తీ. * వివిధ ఈవెంట్లలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలను ప్రకటించాం. * దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేస్తున్నాం. * అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకే సమగ్ర సర్వే చేస్తున్నాం. దీనిపై లేనిపోని సమస్యలు సృష్టించేందుకు కొన్ని శక్తులు యత్నిస్తున్నాయి.