: గోల్కొండ నుంచి కేసీఆర్ ప్రసంగం... హైలైట్స్-1
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టీఎస్ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జెండాను ఆవిష్కరించి, ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే... * వ్యవసాయ ట్రాక్టర్లకు, ట్రాలీలకు పన్నులు రద్దు చేశాం. * ఆటో పన్నును రద్దు చేశాం. * ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చాం. * రవీంద్రభారతి అభివృద్ధికి రూ. కోటి కేటాయించాం. * ఎవరెస్ట్ అధిరోహకులు పూర్ణ, ఆనంద్ లకు చెరో కూ. 25 లక్షలు. * హైదరాబాదును వైఫై నగరంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. * చర్చిల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ల అనుమతి అవసరం లేకుండా చూస్తాం. * త్వరలోనే 10 లక్షల ఎకరాల భూమిని సేకరించి... పారిశ్రామిక అవసరాలకోసం వినియోగిస్తాం. * సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు. * వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 1000 పెన్షన్. * ఎన్ని ఇబ్బందులు ఉన్నా కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ. * నగరంలో కల్లు దుకాణాల ప్రారంభం. గీత కార్మికుల అభివృద్ధి కోసం ఉగాది నుంచి దుకాణాలు. * హైదరాబాదుకు నలువైపులా ఫార్మా, సినీ, ఐటీ సిటీల ఏర్పాటు.