: జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న ఏపీఎస్పీ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ ఎత్తున విద్యార్థులు, యువత తరలి వచ్చారు.