: శ్రీవారిని దర్శించుకున్న అతిలోకసుందరి
ప్రముఖ సినీ నటి శ్రీదేవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో తన చిన్న కుమార్తె ఖుషి కపూర్, సోదరి మహేశ్వరితో కలిసి వైకుంఠం క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. ధ్వజ స్తంభానికి మొక్కుకున్న అనంతరం... ఏడుకొండలవాని దర్శనం చేసుకున్నారు. దర్శనం కోసం శ్రీదేవి వచ్చిందని తెలుసుకున్న భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్ద పోగయ్యారు. శ్రీదేవిని చూడటం కోసం ఎగబడ్డారు.